VSP: మర్రిపాలెం అంబేద్కర్ భవన్లో డిసెంబర్ 14న జరగనున్న కరాటే పోటీల చాంపియన్షిప్ ట్రోఫీను హోం మంత్రి వంగలపూడి అనిత ఇవాళ ఆవిష్కరించారు. పోటీలకు సంబంధించిన వివరాలను నిర్వాహకుడు శివగణేశ్ మంత్రికి వివరించారు. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పలు జిల్లాలకు చెందిన కరాటే క్రీడాకారులు పాల్గొననున్నారని, ఛాంపియన్గా నిలిచిన టీంకు ఈ ట్రోఫీని బహుకరిస్తామని తెలిపారు.