SKLM: గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన సపన్ కుమార్ భబర్త అనే నిందితుడిని అరెస్టు చేసి 13 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శనివారం వెల్లడించారు. పర్లాకిమిడి నుంచి పలాస వరకు బస్సులో వచ్చి అక్కడ నుంచి స్థానిక రైల్వే స్టేషన్కు వెళ్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడినట్లు అయిన తెలియజేశారు. నిందుతుడిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.