WGL: బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుదీర్ రాష్ట్ర బార్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్లో ఇవాళ జరిగిన రాష్ట్ర బార్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయనను ఎన్నుకుంటూ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. తన మీద నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన అడ్వకేట్ ఫెడరేషన్ సభ్యులకు సుధీర్ ధన్యవాదాలు తెలిపారు.