AP: విశాఖ సీఐఐ సమ్మిట్ బిగ్ హిట్ అయిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చంద్రబాబును చూసే ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని తెలిపారు. MSMEలు, స్టార్టప్‌లకు సీఐఐ సమ్మిట్ వేదికగా మారిందన్నారు. సమ్మిట్‌పై వైసీపీ ఆరోపణలు అర్థరహితం అని మండిపడ్డారు. అంబానీ, అదానీ ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నారని గుర్తు చేశారు.