SS: సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 17న సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ శనివారం ప్రకటించారు. ఈ విషయాన్ని గమనించి అర్జీదారులు ఫిర్యాదుల కోసం జిల్లా పోలీస్ కార్యాలయానికి రావద్దని ఆయన కోరారు.