SRPT: కోదాడలో రేపు జరగనున్న PDSU కోదాడ డివిజన్ 23వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సింహాద్రి పిలుపునిచ్చారు. పట్టణంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా రంగ సమస్యలు, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్మెంట్స్ విధానాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో మహాసభకు హాజరు కావాలని ఆయన కోరారు.