VSP: విశాఖపట్నం పోర్టును శనివారం నేపాల్, రష్యా దేశాలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సందర్శించాయి. ఈ బృందానికి నేపాల్ పరిశ్రమ, వాణిజ్యం, సరఫరాల శాఖ మంత్రి అనిల్ కుమార్ సిన్హా నాయకత్వం వహించారు. ఆయనతో పాటు అధికారులు బిపీన్ ఆచార్య, తరకరాజ్ భట్ట కూడా ఉన్నారు. రష్యా నుండి వచ్చిన 11 మంది సభ్యుల వ్యాపార ప్రతినిధి బృందం కూడా పోర్టును సందర్శించింది.