ADB: ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయడం జరుగుతుందని వ్యవసాయం మార్కెట్ కమిటీ అధికారి గజానంద్ శనివారం తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర జిన్నింగ్ మిల్ అసోసియేషన్ పిలుపు మేరకు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కొనుగోళ్ల విషయంలో తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని సూచించారు.