BHNG: అడ్డగూడూరు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇవాళ రామన్నపేట న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు లీగల్ ఎడ్ క్లినిక్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లీగల్ సర్వీసెస్ టీం సభ్యులు కోక కవిత విద్యార్థులకు లీగల్ సర్వీసెస్ ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.