E.G: పెరవలి మండలం అన్నవరప్పాడులో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నప్రసాద ట్రస్ట్‌కు ఖండవిల్లి వాస్తవ్యులు గొల్లి సూర్యారావు, సత్తెమ్మ దంపతులు రూ. 80 వేలు విరాళంగా అందజేశారు. ముందుగా దాతలు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ఈవో రాధాకృష్ణ స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు.