KMR: పశువుల్లో సోకే వ్యాధుల పట్ల పాడి రైతులు నిర్లక్ష్యం చేయవద్దని పశు వైద్యాధికారి రవికిరణ్ సూచించారు. శనివారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లిలో పశువులకు గాలికుంటు టీకాలను వేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ అధ్యక్షుడు ఆకుల రవికుమార్, డాక్టర్లు ప్రవీణ్, బాలు, పశు వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.