MNCL: జన్నారం కలమడుగు చెక్ పోస్ట్ వద్ద భారీగా పట్టుబడిన అక్రమ కలపపై అటవీ శాఖ అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోకుండా, డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై వాహనాలపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే అటవీ సంపదకు ముప్పు ఉందన్నారు.