సూపర్ స్టార్ కృష్ణ తరహాలో ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా ప్రొడ్యూసర్స్ హీరో అని ‘వారణాసి’ నిర్మాత కేఎల్ నారాయణ ప్రశంసలు కురిపించారు. 15 ఏళ్ల క్రితం మహేష్‌తో సినిమా తీయాలని రాజమౌళిని అడగ్గా.. ఆయన అంగీకరించారని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి ఇన్నాళ్లు పట్టిందని.. అప్పటికీ, ఇప్పటికీ రాజమౌళిలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు.