SRD: 60లక్షలతో ORR సర్వీస్ రోడ్డు నుంచి బేగంపేట వరకు రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయని ఇంద్రేశం మాజీ సర్పంచ్ బండి హరి శంకర్ అన్నారు. HITTTV ప్రతినిధితో మాట్లాడుతూ.. భారీ వర్షాలకు ప్రధాన రోడ్డు మొత్తం గుంతలమయం అయిందని తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో 60 లక్షలు మంజూర్ అవ్వడంతో రోడ్డు పనులు ప్రారంభించామని పేర్కొన్నారు.