NZB: రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శనివారం సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే యూకేజీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని గ్రామస్తులు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ తనిఖీ జరిగింది. పాఠశాలలో సరైన గదులు లేకపోవడం వల్ల విద్యార్థులు నేలపై కూర్చోవాల్సి వస్తోందని స్థానికులు ఆయనకు తెలిపారు.