SRD: మునిపల్లి మండలం అంతారం శ్రీ జీవన్ ముక్త మహారాజ్ ఉత్సవాలను పురస్కరించుకుని, ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంజయ్య, ఏఎంసీ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామ్ రెడ్డి, నరసింహ గౌడ్ పాల్గొన్నారు.