KKD: కాకినాడ పోర్టు స్టేషన్ – టౌన్ స్టేషన్ మధ్య సూర్యనారాయణపురం మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ గేటును ఈనెల 17 నుంచి 26 వరకు 10 రోజులు మూసివేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎం.రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన ట్రాక్ మరమ్మతుల కోసం ఈ గేటును మూసివేసి , ట్రాఫిక్‌ను మళ్లిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.