KNR: ఇల్లంతకుంట మండలం సిరిసేడు ఆర్ అండ్ బీ రోడ్డు పక్కన గ్రామ పంచాయతీ స్థలంలో 30 ఏళ్లుగా నిర్మించుకున్న షాపింగ్ షెడ్లు, డబ్బాలను ఈ నెల 17న తొలగించనున్నారు. స్థలాన్ని ఖాళీ చేయాలని గత నెల నుంచే అధికారులు నోటీసులు జారీ చేశారు. పోలీసు బందోబస్తు మధ్య డబ్బాలను తొలగిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి నోటీసులు అందజేశారు.