హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు ఎంట్రీ అదిరిపోయింది. తమ హీరోను చూడగానే వేదిక ప్రాంగణం విజిల్స్, కేకలతో దద్దరిల్లిపోయింది. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ‘వారణాసి’ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.