ELR: జిల్లాలో ఇవాళ ఉదయం నుంచి రవాణా శాఖ తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో మొత్తం 72 ప్రైవేటు బస్సులపై కేసుల నమోదు చేశామని డీటీసీ, జిల్లా రవాణాధికారి కమిషనర్ షేక్ కరీం తెలిపారు. ఏలూరు హైవేలోని కలపర్రు వద్ద తనిఖీలు జరగగా.. రూ. 7.65 లక్షల జరిమానా విధించామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు.