SDPT: కొండపాక మండల శివారులోని రాజీవ్ రహదారి పై శనివారం రెండు లారీలు ఢీ కొన్నాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న లారీ రోడ్డు పక్కన నీళ్లు పోస్తున్న మరో లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ప్రవీణ్ (38) తలకు తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్స్ సిబ్బంది అతడిని 30 నిముషాలు శ్రమించి బయటకు తీసి, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.