NRML: బాసర మండలం టాక్లి గ్రామానికి చెందిన చిల్లేవాడ్ హమ్మీబాయి (55) గ్రామ శివారులోని వాగు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను రక్షించే ప్రయత్నంలో ఆమె కుమారుడు శ్రీనివాస్ వాగులో దూకి గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. మహిళ మృతదేహం నీటిలో తెలియాడుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.