HYD: భారత రాజ్యాంగాన్ని 130 సార్లు సవరణ చేశారని, 56 శాతం జనాభా ఉన్న బీసీల కోసం మరోసారి సవరించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీజేఏసీ కో-ఆర్డినేటర్ గుజ్జ సత్యం అధ్యక్షతన శనివారం కాచిగూడలోని హోటల్లో బీసీ, కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు.