TG: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారించామని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. BCలకు 42 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి వేరే పార్టీలకు లేదని చెప్పారు. రిజర్వేషన్లకు బీజేపీ అనేక అడ్డంకులను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఎవరూ ఎన్ని ఆటంకాలు కలిగించిన రిజర్వేషన్లు ఇస్తామని వెల్లడించారు.