SBI కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 1 నుంచి SBI తన mCash సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లు ఇకపై మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీని ఉపయోగించి లబ్ధిదారుడిని యాడ్ చేయకుండా డబ్బు పంపడం లేదా క్లెయిమ్ చేయడం సాధ్యపడదని తెలిపింది. దానికి బదులుగా UPI, IMPS, NEFT, RTGS వంటి ఇతర డిజిటల్ చెల్లింపులను ఉపయోగించాలని సూచించింది.