VSP: పరవాడ మండలం పరిధిలోని లంకెలపాలెం ఇండస్ట్రియల్ జోన్లో ఇవాళ సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలో ఉన్న ఫార్మా కంపెనీలకు సంబంధించిన స్క్రాప్ లోడ్ చేసి ఉంచిన ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం, ఫైర్ ఇంజిన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.