కరీంనగర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న మనుపాటి శేఖర్, సంజీవ్, మహేష్, బోదాసు కుమార్, సాగర్ల రంజిత్, బుడిగే సంపత్‌లను అరెస్ట్ చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీరి నుంచి బొలెరో, వ్యాన్, ద్విచక్ర వాహనాలతో పాటు మూడు క్వింటాళ్ల కాపర్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొమ్ముతో వీరు జల్సాలు చేసేవారని ఆయన వెల్లడించారు.