కోనసీమ: ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి వారిని భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ రాయబారి థైయార్ మాతోపు దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈవో దుర్గ భవాని సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆలయ విశిష్టత, చరిత్రను అడిగి తెలుసుకున్నారు.