సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ టైటిల్ను మేకర్స్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ‘వారణాసి’ టైటిల్ను ఖరారు చేశారు. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా రాబోతోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.