HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచినంత మాత్రాన CM రేవంత్ రెడ్డి చేసిన పాపాలను ప్రజలు విస్మరించరని MLC దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. లగచర్ల నిరుపేద గిరిజనులపై చేసిన దాష్టికాన్ని, HCUలో మూగజీవాలపై సృష్టించిన అరాచకాన్ని ఈ ఎన్నికద్వారా మరచిపోతారా అని ప్రశ్నించారు. ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అందించలేని దానిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.