ADB: అన్నదాతలకు అండగా వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేపట్టనున్నట్లు మాజీమంత్రి జోగురామన్న అన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 21 వ తేదీన భోరజ్ వద్ద ఉన్న రిలయన్స్ పెట్రోల్ పంప్ వద్ద రైతులతో కలిసి నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో అఖిల పక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘం నేతలతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు.