ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఇటుక ధరలు పెనుభారంగా మారాయి. స్థానిక ఇటుక బట్టీల తయారీదారులు సిండికేట్గా ఏర్పడి ధరలను పెంచినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గతంలో 2,500 ఇటుకల ధర రూ.10,000 ఉండగా, ప్రస్తుతం రూ.18,000 వరకు పెరిగింది. దీంతో ఇల్లు నిర్మాణం ప్రారంభించిన పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.