E.G: మదర్ ఆఫ్ ట్రీ గా పిలువబడే కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ పర్యావరణ కార్యకర్త, సాలుమరద తిమ్మక్క శుక్రవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. 114 సంవత్సరాల వయసుగల ఈ తిమ్మక్క దశాబ్దాల కాలం నుంచి వేలాది మొక్కలు నాటింది. అయితే ఈ తిమ్మక్కకు కడియం గౌతమి నర్సరీ యువ రైతు మార్గాని వెంకట శేషు అంటే ఎంతో ఇష్టం. శేషు కుటుంబ సభ్యులతో తిమ్మక్క కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.