SKLM: ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సేవాదృక్పథం కలిగి ఉండాలని జిల్లా యువజన అధికారి వెంకట్ ఉజ్వల్ పేర్కొన్నారు. ఆముదాలవలస(M) నైరా వ్యవసాయ పరిశోధన కళాశాల ఫైనల్ విద్యార్థులు, NSS యూనిట్ ఆధ్వర్యంలో బైరువానిపేట చల్లపేట గ్రామంలో ఇవాళ ‘స్వచ్ఛభారత్ స్వచ్ఛంద’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యంపై రైతులకు, యువకులకు. మహిళలకు తెలియజేయాలని ఆయన సూచించారు.