CTR: కాణిపాకంలో శనివారం భక్తులు పోటెత్తారు. 3వ శనివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వరసిద్ధుడి దర్శనార్థం కాణిపాకం విచ్చేశారు. క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు ఆలయం వెలుపలకు వచ్చారు. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షించారు.