WGL: నర్సంపేట మండలం లోని అమరవీరుల స్తూపం వద్ద ఇవాళ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా BJP జిల్లా కార్యదర్శి డా. రానా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. డివిజన్లోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లుగా ఆరోపించారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాల్సిందిగా కోరారు.