KMR: జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాపై KMR పోలీస్ ఉక్కుపాదం మోపింది. ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు భాస్కర్ భాపురావ్ చవాన్‌పై కలెక్టర్ ఆదేశాల మేరకు PD యాక్ట్ అమలు చేశారు. అతడు KMR, NZB, NRML జిల్లాల్లో 14 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు. ముఠాలోని మరో ముగ్గురిపై PD యాక్ట్ అమలు చేశారు.