భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. కొత్తగూడెం క్లబ్లో రేపు జరిగే మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ పేర్కొన్నారు. సకాలంలో సంబంధిత శాఖల అధికారులు, నిరుద్యోగులు హాజరుకావాలని కోరారు.