KDP: బ్రహ్మంగారిమఠంలోని తెలుగు గంగ జలాశయం పూర్తిస్థాయిలో నిండటం చరిత్రలో మొదటిసారి ఇదేనని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. శనివారం తెలుగు గంగ జలాశయంలో కృష్ణా జలాలకు జల హారతినిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జలాశయం పూర్తిస్థాయిలో నిండటం వల్ల రైతులకు పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉంటుందని అని పేర్కొన్నారు.