చిత్తూరు జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు మాజీ సీఎం జగన్ని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులను మాజీ సీఎంకు వివరించారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల విజయవంతంపై సూచనలు ఇచ్చినట్టు శ్రీనివాసులు తెలియజేశారు.