BDK: టేకులపల్లి మండలం గంగాపురం గ్రామంలో పూర్తయిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ గృహాన్ని ఇవాళ ప్రారంభించారు. తమకు ఇల్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే దంపతులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించారు.