SRPT: వైద్యులు శస్త్రచికిత్స చేసి ఓ గొర్రె ప్రాణాలను కాపాడిన అరుదైన ఘటన కోదాడ ప్రభుత్వ పశువైద్యశాలలో చోటుచేసుకుంది. మునగాల మండలం నర్సింహాపురానికి చెందిన వీరబోయిన ధనయ్య గొర్రె వరిపొలంలో వడ్లు తినడంతో పొట్ట ఉబ్బింది. కోదాడకు తరలించగా.. శస్త్రచికిత్సలో వడ్లతో పాటు 5 కిలోల ప్లాస్టిక్ కవర్లు బయటపడ్డాయి. డా. పెంటయ్య శస్త్రచికిత్స చేసి గొర్రెప్రాణాలు కాపాడినట్లు యజమాని తెలిపారు.