CTR: రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ తుషార్ డూడి శనివారం ఆకస్మిక తనికీ చేశారు. మొదటగా గౌరవ వందనం స్వీకరించిన ఆయన స్టేషన్ పరిసరాల మండల మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు.