E.G: విశాఖ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన జన్మదినం సందర్భంగా సీఎం ఆశీస్సులు తీసుకున్నారు. ఒక్క రోజులోనే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు.