SRPT: వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ పిల్లల బాధ్యతేనని జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గాంధీ పార్క్ నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధాప్యం రెండో బాల్యం లాంటిదని, పిల్లలతో సమానంగా వయో వృద్ధులను కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.