నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇవాళ సందర్శించారు. ఈ మేరకు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవితో కలిసి వీసీ తన చాంబర్లో మల్లన్నను శాలువాతో సత్కరించారు. యూనివర్సిటీ అంశాలపై చర్చించి పలు సమస్యలను ఎమ్మెల్సీకి వివరించారు.