MBNR: 2025-26 ధాన్యం కేటాయింపుకు బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి అని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 92 రైస్ మిల్లులు ఉండగా నామమాత్రంగా కేవలం 42 రైస్ మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారెంటీని సమర్పించాయని అన్నారు.