SKLM: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు కూరగాయల నారు పెంపకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రోగ్రాం కోఆర్డినేటర్ కే. భాగ్యలక్ష్మి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్ నెట్లలో ప్రోట్రే విధానం ద్వారా కూరగాయల నారు పెంపకం, చీడపీడల నివారణపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆసక్తి గల గిరిజన యువత గమనించాలని సూచించారు.