ప్రకాశం: కంభం మండలంలోని అన్ని రైతు సేవ కేంద్రాల్లో ఖరీఫ్-2025 సంబంధించి ఈ-పంట జాబితాలను సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శించినట్లు మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ తెలిపారు. మండలంలోని కందులాపురం ఎల్.కోట గ్రామాల్లో ప్రదర్శించిన జాబితాలను ఆయన శనివారం తనిఖీ చేశారు. వివరాల్లో తేడాలు ఉంటే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.