JGL: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ శనివారం మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రభుత్వ విభాగాల ప్రధాన బాధ్యత అని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.